ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తి నాకు లేదు: కాంగ్రెస్ సీనియర్ నేత

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-13 11:05:18  IST  )

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ్‌కుమార్‌(Kusum Kumar).. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తి నాకు లేదు: కాంగ్రెస్ సీనియర్ నేత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ్‌కుమార్‌(Kusum Kumar).. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఒడిశా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జికి.. కో-ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. పదవి దక్కడంపై జెట్టి కుసుమ కుమార్ స్పందించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తి నాకు లేదని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తిగా ఉందని చెప్పారు. పార్టీ ఆర్గనైజేషన్ పనులు చేయడమే నాకు ఇష్టమని అన్నారు. ఒడిశాతో పాటు తెలంగాణలోనూ పని చేస్తానని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీపై దృష్టి పెట్టమని అధిస్థానం చెప్పింది.. తప్పకుండా జీహెచ్‌ఎంసీలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానని అన్నారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. EVMలు వచ్చాక రిగ్గింగ్ చేయడానికి అవకాశమే లేదని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా నియమించినందుకు సంతోషంగా ఉంది. నాకు పదవి రావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పనిచేస్తే పదవులు దక్కుతాయని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించింది. ఒడిశా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుంది. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోంది. మరోవైపు.. దశాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా ఎవరూ ఎంపిక కాలేదని, కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యతను గుర్తించిన అధిష్టానం.. కుసుమ్‌ కుమార్‌కు కీలక పదవి అప్పజెప్పిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story