- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజగోపాల్ చేసిన తప్పు వెంకట్ రెడ్డి చేయొద్దు: వీహెచ్
by GSrikanth |
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుంతరావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీలో నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టి, సయోధ్య కుదిర్చే బాధ్యతలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం వీహెచ్‌కు సూచించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుంతరావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీలో నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టి, సయోధ్య కుదిర్చే బాధ్యతలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం వీహెచ్‌కు సూచించారు. దీనిపై వీహెచ్ స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోవర్టు అనడం బాధించిందని వ్యాఖ్యానించారు. వెంకట్ రెడ్డి ప్రచారానికి రాకపోవడం వల్లే ఇలాంటి విమర్శలు అన్నీ ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. వీటిన్నింటికీ చెక్ పెట్టేలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్లాలని వీహెచ్ కోరారు. నాకూ పార్టీలో ఎన్నో అవమానాలు జరిగాయని, అయినా తాను పార్టీ మారలేదని గుర్తుచేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లి తప్పుచేశారని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ తప్పు చేయొద్దని సూచించారు.
Next Story






