- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madhuyashki Goud: నిలకడగా మధుయాష్కీ ఆరోగ్యం.. ఇంతకీ ఏమైందంటే?
by Ramesh Naini |
సచివాలయంలో మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పృహతప్పి పడిపోయిన విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Telangana Secretariat)లో మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ (Madhuyashki Goud) గౌడ్ స్పృహతప్పి పడిపోయిన విషయం తెలిసిందే. (Minister Sridhar Babu) మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన సచివాలయ సిబ్బంది, ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ నేతలు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. గచ్చిబౌలిలోని (AIG Hospital) ఏఐజీలో చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బీపీ ఎక్కువ, తక్కువ అవ్వడం వల్లే కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఏఐజీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు మధుయాష్కీ వీల్ చైర్‌లో ఉన్న ఫోటోలను పార్టీ శ్రేణులు రిలీజ్ చేశాయి.
Next Story






