బాసర ట్రిపుల్ ఐటీకి 10 మంది మానుకోట మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక

by Ratna Kumari |

మహాబూబాబాద్ మోడల్ స్కూల్ విద్యార్థులు మరో సారి తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) ప్రవేశాల్లో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికై పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.

బాసర ట్రిపుల్ ఐటీకి  10 మంది మానుకోట మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక
X

దిశ, మహాబూబాబాద్ ప్రతినిధి : మహాబూబాబాద్ మోడల్ స్కూల్ విద్యార్థులు మరో సారి తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) ప్రవేశాల్లో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికై పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. శనివారం రాత్రి విడుదలైన ప్రవేశ ఫలితాల్లో పి. కీర్తన, జి. సిరి, బి. అక్షయ, ఎండి. సానియా, ఏ. భాను ప్రకాష్, బి. చరణ్, జె. నవ్యశ్రీ, జి. కిరణ్ కుమార్‌, ఏ ప్రహర్ష, ఎం జశ్వంత్ లు సీట్లు సాధించినట్లు ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు.

ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షల్లో 578కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ప్రవేశ అవకాశం లభించిందన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ, తల్లిదండ్రుల సహకారం ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యను అందించే బాసర ట్రిపుల్ ఐటీలో ఒకేసారి 8 మంది విద్యార్థులు ఎంపిక కావడం పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఎంపికైన విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల విజయం పై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Next Story