కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం: సీతక్క ఫైర్

by Gantepaka Srikanth |

కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం: సీతక్క ఫైర్

కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం: సీతక్క ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి వారి గొంతు కోసింది నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కుల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కుల గణనను పూర్తి చేసి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారయ్యాయని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందని మంత్రి అన్నారు. "కొన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉండటంతో, 50 శాతం పరిమితిని దాటి పోకుండా ఉండేందుకు బీసీ రిజర్వేషన్లలో కొంత మార్పు జరిగింది." అని స్పష్టం చేశారు.

Next Story