- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీడ్ అథారిటీలో రాజకీయ చాతుర్యం.. డైరెక్టర్ పదవికి పైరవీలు
రాష్ట్రంలో సీడ్అథారిటీ డైరెక్టర్ పదవికి భారీ డిమాండ్ ఉంది. ఆ పోస్టును దక్కించుకునేందుకు పలువురు ప్రొఫెసర్లు పైరవీలకు తెర తీశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సీడ్అథారిటీ డైరెక్టర్ పదవికి భారీ డిమాండ్ ఉంది. ఆ పోస్టును దక్కించుకునేందుకు పలువురు ప్రొఫెసర్లు పైరవీలకు తెర తీశారు. ప్రస్తుత అధికారి పదవీ కాలం ఈనెలాఖరున ముగియనుండటంతో చక్రం తిప్పేందుకు పూనుకున్నారు. ఈసారి తమకు అవకాశం కల్పించాలని మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూ వేడుకుంటున్నారు. డైరెక్టర్పోస్టును భర్తీచేసేందుకు ప్రభుత్వం ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారిలో అర్హులు లేకపోవడంతో పక్కకుపెట్టినట్లు తెలిసింది. మరోసారి ప్రస్తుత డైరెక్టర్ కే పదవి దక్కుతుందని సెక్రెటేరియట్ లో ప్రచారం జరుగుతున్నది. ఆయన తన రాజకీయ చాతుర్యంతో పదేళ్లుగా ఇదే పోస్టులో కొనసాగుతూ అన్ని విధాలుగా ఎదిగారు. పలుమార్లు ఆయనపై ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారుల అండదండలతో ఏమీ చేయలేకపోయారు. మరోసారి సైతం కుర్చీ వదలకుండా తనదైనశైలిలో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని మరో రెండేళ్ల పాటు డైరెక్టర్పోస్టులో కొనసాగేందుకు పైరవీలు చేస్తున్నట్లు అగ్రికల్చర్యూనివర్శిటీ అధికారులు చెప్పారు. ఆయన ఉన్నంత కాలం మరొకరికి చాన్స్దొరకదని, ఇప్పటికే ఒక సీనియర్ఐఏఎస్అధికారికి కోట్ల రూపాయలు పెట్టి ఖరీదైన భవనం నిర్మించినట్లు తెలిసింది. ఆ పెద్ద అధికారి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని తిరస్కరించేలా ఎత్తులు వేసి తనకు ఎప్పటికప్పడు ముడుపులు ఇచ్చే అధికారిని నియమించేకులా కుట్రలు చేస్తున్నారని ప్రచారం ఉంది. ఈ శాఖ తీరుపై ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంతో ఉన్నారు. విత్తన కంపెనీలు చేసే అక్రమాలకు అధికారులు అండగా రాష్ర్టంలో రైతులు నష్టపోయేలా విత్తనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నా విత్తన ధ్రువీకరణ సంస్థ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుందని పలుమార్లు హెచ్చరించారు. ఈ సంస్థ మరో కార్పొరేషన్లో విలీనం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. వ్యవసాయ శాఖలో అన్నదాతలకు అక్కరకు రాని సంస్థలు ఎన్నో ఉన్నాయని వాటి ద్వారా ప్రభుత్వానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని, యాక్టివ్ కార్పొరేషన్లలో కలిసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.
చక్రం తిప్పుతున్న విత్తన కంపెనీలు
కొత్త డైరెక్టర్తమకు అనుకూలంగా ఉండటం కష్టమని, పాత వారినే కొనసాగిస్తే తమ వ్యాపారానికి ఢోకా ఉండదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విత్తన కంపెనీల నిర్వాహకులు రాజకీయ పైరవీలు మొదలుపెట్టారు. ఇటీవల కంపెనీ సంఘం ఏర్పాటు వేడుకలు నిర్వహించి ప్రభుత్వానికి తాము అండగా ఉన్నామని ప్రకటించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తామని నకిలీ విత్తనాలు తీసుకొచ్చే సంస్థల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం పెద్దలను అప్పడే మచ్చిక చేసుకుని తాము సూచించిన వారే డైరెక్టర్గా కొనసాగేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే అగ్రికల్చర్యూనివర్శిటీ ప్రొఫెసర్లు ఒకరిని ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని, మిగతా వారికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమకు ఎందుకు అర్హత లేదో చెప్పాలని దరఖాస్తులు ఉన్నతాధికారులు తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతల కనుసన్నలో ఉండే పోస్టులకు దరఖాస్తులు తీసుకోవడం ఎందుకని నేరుగా భర్తీచేసే సరిపోతుందని పేర్కొంటున్నారు.
పాత డైరెక్టర్ఉండేలా ఆదేశాలు
ప్రస్తుతానికి పాత డైరెక్టర్కొనసాగేలా చూడాలని, కొత్తవారికి పోస్టు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యవసాయశాఖ కార్యదర్శికి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇతరులను తీసుకురావాలన్న ప్రయత్నాలను నిలిపివేయాలని, తాము సూచించిన వారి పేరు ఫైనల్చేయాలని, ఇందులో రాజకీయాలు చేయొద్దని హెచ్చరించినట్లు వ్యవసాయ శాఖలో చర్చ నడుస్తున్నది. పూర్వ అధికారి ఇప్పటికే పదేళ్లు కొనసాగారని, మరోసారి పదవి అప్పగిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా కొత్తవారికి చాన్స్ఇవ్వొద్దని చెప్పినట్లు తెలిసింది. ప్రొఫెసర్లు ఎవరు దరఖాస్తు చేసినా పలు కారణాలను చూపి రిజెక్ట్చేయాలని సూచించినట్లు కమిషనర్కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన కూడా ఏమీ చేయలేక ఉన్నతాధికారి చెప్పింది పాటించక తప్పడం లేదని కిందిస్థాయి ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.






