- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు ప్రయోజనాల పరిరక్షణకు విత్తనం చట్టం : మంత్రి తుమ్మల
సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశలో ప్రభుత్వం ఉందని, రైతు ప్రయోజనాల పరిరక్షనే చట్టం పరమావధి కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశలో ప్రభుత్వం ఉందని, రైతు ప్రయోజనాల పరిరక్షనే చట్టం పరమావధి కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో సమగ్ర విత్తనచట్టం, అవశ్యతకత అంశంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో విత్తనచట్టంలో మార్పుల కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయని, అప్పటి ప్రభుత్వం ప్రయత్నంతో బి.టి కాటన్ విత్తనం ధర రూ.1800 నుండి రూ.650 చేరుకుందని తెలిపారు. 1966లో తీసుకొచ్చిన విత్తన చట్టం మారిన పరిస్థితుల కారణంగా స్థానిక అవసరాల దృష్ట్యా వాటిలో కొన్ని అదనపు రూల్స్ తీసుకోవాల్సి ఉంటుందని, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీల ఆర్అండ్డి వసతులపై నిరంతర నిఘా అవసరమని అధికారులకు సూచించారు. ఎవరైనా కల్తీ విత్తనాలు సరఫరా చేస్తే తీసుకొనే చర్యలు కఠినంగా రూపొందించాలని, విత్తనోత్పత్తి రైతులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చే విధంగా విత్తనచట్టం 1966లో కొన్ని మార్పులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ మార్పులు కూడా చట్టాల పరిధిలోకి లోబడి తీసుకొచ్చేవిధంగా డ్రాప్ట్రూపకల్పన చేయాలని ఆదేశించారు. దీని కోసం ఐదుగురు సభ్యులతోత కూడిన కమిటీని ఏర్పాటు చేసి నిర్ధిష్టమైన కాలపరిమితిలో మూడు నెలలలో ముసాయిదా సిద్ధం అయ్యేట్లు చూడాలని ఆదేశించారు. అనంతరం వ్యవసాయ కమిషన్సభ్యలు సునీల్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాల వివరాలు ముఖ్యంగా మహారాష్ట్రంలో అమలవుతున్న పరిహారం చెల్లింపు వంటివి పరిశీలించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉందని, విత్తన రైతుల ప్రయోజనాలు కూడా కాపాడేవిధంగా చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి వివరించారు. ఈకార్యక్రమంలో వ్యవసాయకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.






