త‌ప్పుల త‌డ‌కగా సచివాలయ ఆదాయపు పన్ను చెల్లింపు లెక్కలు : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

by Muthe.Rajitha |

రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు జీత‌భ‌త్యాల చ‌ట్టం 1953 సెక్షన్ (3) ప్రకార‌ము సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కేబినెట్ హోదా కార్పోరేష‌న్ చైర్మన్‌లు, స‌ల‌హాదారుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లించాలనే ప‌ద్ధతి రాజ్యాంగ విరుద్ధమని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షుడు యం. ప‌ద్మనాభ‌రెడ్డి సోమవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.

త‌ప్పుల త‌డ‌కగా సచివాలయ ఆదాయపు పన్ను చెల్లింపు లెక్కలు : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు జీత‌భ‌త్యాల చ‌ట్టం 1953 సెక్షన్ (3) ప్రకార‌ము సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కేబినెట్ హోదా కార్పోరేష‌న్ చైర్మన్‌లు, స‌ల‌హాదారుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లించాలనే ప‌ద్ధతి రాజ్యాంగ విరుద్ధమని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షుడు యం. ప‌ద్మనాభ‌రెడ్డి సోమవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప‌ద్ధతి నిలుపుదల చేయాలని రాష్ట్ర ఛీఫ్ సెక్రటరి (సీఎస్) కి ఫిర్యాదు చేసినట్లు పేర్కోన్నారు. పలుమార్లు లేఖ‌లు రాసినా ఫ‌లితం లేక‌పోయిందని తెలిపారు. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రిపాల‌న విభాగ కార్యద‌ర్శిని ఆదాయ‌పు ప‌న్ను ఎవ‌రెవ‌రివి ఎంత‌ చెల్లిస్తున్నారని వివ‌రాలు అడుగ‌గా, అది వ్యక్తిగ‌త స‌మాచార‌మ‌ని, ఇవ్వడానికి కుద‌ర‌ద‌ని తెలిపారని పేర్కొన్నారు. ప్రభుత్వ డ‌బ్బు ఖ‌ర్చుచేస్తున్నారు కాబ‌ట్టి ప్రతి పౌరుడికి తెలుసుకునే అధికార‌ముందని, ఇది వ్యక్తిగ‌త స‌మాచారం కాదని ప్రశ్నించినట్లు తెలిపారు.

స‌చివాల‌యంలో ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపు లెక్కలు త‌ప్పుల త‌డ‌కగా ఉన్నాయని తెలిపారు. ఈ విష‌యంపై విచార‌ణ జ‌రిపించి ముందు ముందు ఇటువంటి త‌ప్పులు దొర్లకుండా చూడాల్సిన అవ‌స‌ర‌ముందని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఈ చ‌ట్టాన్ని స‌వ‌రించి ముఖ్యమంత్రి, మంత్రులు త‌మ ఆదాయ‌పు ప‌న్ను వారే చెల్లిస్తున్నారని తెలిపారు. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల‌లో మాత్రమే ఈ రాజ్యాంగ విరుద్ధమైన విధానం జ‌రుగుతుందని పేర్కోన్నారు. 2024-25 ఆర్థిక సంవ‌త్సరం ముగింపుకు వ‌స్తున్న సంద‌ర్భంలో ఈ సంవ‌త్సరంలో ఎవ‌రెవ‌రి పేర ఎంత ఆదాయ‌పు ప‌న్ను చెల్లించినారో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచ‌గ‌ల‌ర‌ని సీఎస్ ను కోరినట్లు తెలిపారు. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సర‌ము నుంచి ప్రభుత్వ డ‌బ్బుతో ఎవ‌రి ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌వ‌ద్దని ఆర్డర్ పాస్ చేయ‌గ‌ల‌ర‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ తరపున కొరుతున్నట్లు వెల్లడించారు.

Next Story