- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎస్ కు సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు
సెక్రటేరియట్ లో మధ్య స్థాయి అధికారులు వేధింపులకు గురవుతున్నారని తెలంగాణ సెక్రటెరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు సీఎస్ కు శనివారం ఫిర్యాదు చేశారు.

- మధ్యస్థాయి అధికారులు వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదు
- దిశ పేపర్ లో వచ్చిన కథనాల ఆధారంగా పిర్యాదు
- తక్షణమే చర్యలు చేపట్టాలని కోరిన ఆఫీసర్స్ అసోసియేషన్
దిశ, తెలంగాణ బ్యూరో : సెక్రటేరియట్ లో మధ్య స్థాయి అధికారులు వేధింపులకు గురవుతున్నారని తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు సీఎస్ కు శనివారం ఫిర్యాదు చేశారు. సెక్రటెరియట్ లోని కొందరూ ఉన్నతాధికారుల తీరుతో మధ్య స్థాయి అధికారులు పని చేయలేక రిటైర్‌మెంట్ తీసుకునే యోచనలో ఉన్నారని తెలిపారు. ఇదే విషయాన్ని ఇటీవల ‘దిశ’ పత్రికలో కథనాలు వచ్చినట్లు సీఎస్ దృష్టికి తీసుకువెళ్లారు. "యూస్ లెస్ ఫెలో మైండ్ లేదా, సెక్రటేరియట్ లో ఐఏఎస్ ల తిట్లా దండకం, ఇండస్ట్రీ ఐటీ సెక్రటరీ బూతులు .. ఆఫీసర్ కు గుండెపోటు" అనే కథనాలు వచ్చినట్లు వివరించారు. మధ్య స్ధాయి అధికారుల పై జరుగుతున్న వేధింపులకు పరిష్కారం చూపాలని కోరారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కారణాల లేకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై వెంటనే చర్యలు చేపట్టాలని సీఎస్‌ను కోరారు.






