T Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం.. ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీ

by Muthe.Rajitha |

తెలంగాణ కాంగ్రెస్‌(T Congress)లో మరో ముసలం పుట్టింది. తమ సామాజిక వర్గానికి ఎలాగైనా ఓ మంత్రి పదవి దక్కాలని కొంతమంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ(MLAs Secret Meeting) అయ్యారు.

T Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం.. ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్‌(T Congress)లో మరో ముసలం పుట్టింది. తమ సామాజిక వర్గానికి ఎలాగైనా ఓ మంత్రి పదవి దక్కాలని కొంతమంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ(MLAs Secret Meeting) అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌లో మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు(SC Community MLAs) కవ్వంపల్లి సత్యనారాయణ, తోట లక్ష్మీకాంతరావు, ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, మందుల సామెల్ రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. మాదిగ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని వీరంతా డిమాండ్ చేశారు. ఈ భేటీలో వారు తమ సామాజికవర్గానికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని వాపోయారు.

తెలంగాణలో మాదిగలు 47 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారని, కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గట్టిగా మద్దతు ఇచ్చినా కేబినెట్‌లో స్థానం దక్కలేదని వీరంతా తీవ్ర ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. సమావేశం అనంతరం వీరు తెలంగాణ AICC ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌(AICC in-charge Meenakshi Natarajan)తో ఫోన్‌లో మాట్లాడి, తమ డిమాండ్లను వినిపించారు. అయితే ఈ విషయంపై మరింత చర్చించేందుకు రేపు వీరిని స్వయంగా కలవమని మీనాక్షి నటరాజన్ సూచించనట్టు విశ్వసనీయ సమాచారం.

ఈ సమావేశం ద్వారా పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచి, మాదిగ సామాజికవర్గానికి కేబినెట్‌లో స్థానం సంపాదించాలని ఎమ్మెల్యేలు పట్టుదలతో ఉన్నారు. కాగా ఈ పరిణామం మాదిగలకు రాజకీయంగా న్యాయం చేసే దిశగా ఒక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు రాజకీయ నిపుణులు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Next Story