Municipal Elections: నేటితో ముగియనున్న ప్రచారం పర్వం.. మరికాసేపట్లో ఎస్ఈసీ కీలక మీటింగ్

by Prasad Jukanti |

మున్సిపల్ పోలింగ్‍పై రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది.

Municipal Elections: నేటితో ముగియనున్న  ప్రచారం పర్వం..  మరికాసేపట్లో ఎస్ఈసీ  కీలక మీటింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలకు (Telangana Municipal Elections) సంబంధించిన ప్రచార పర్వం ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, కో ఆర్డినేటర్లతో వీడియో కాల్ నిర్వహించి పోలింగ్ ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సుల తరలింపు, ఎన్నికల సామగ్రి అప్పగింత వంటి అంశాలపై చర్చించనుంది. ఈ నెల 11న పోలింగ్ నిర్వహించి 13వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా ఇవాళ ప్రాచారనికి ఆఖరు రోజు కావడంతో ప్రధాన పార్టీ నేతలు రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రచారంలో లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది.

Next Story