స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ సమీక్ష.. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులతో కీలక భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-20 09:16:48  IST  )

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ సమీక్ష.. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులతో కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా గ్రామ పంచాయతీల ఓటరు జాబితా సవరణ, తుది ప్రచురణపై చర్చించనున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలు, సాంకేతిక ఏర్పాట్ల సన్నద్ధతపై చర్చించనున్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో భద్రతా ఏర్పాట్లు, కేంద్ర బలగాల మోహరింపు, ఎన్నికల కోడ్ అమలు, ఖర్చుల పర్యవేక్షణ, ఈవీఎం యంత్రాల సన్నద్ధత, శిక్షణ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. కాగా, ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story