- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోస్త్ మొదటి విడతలో 56,147 మందికి సీట్ల కేటాయింపు
డిగ్రీ ఆన్ లైన్ సర్విసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడతలో 56,147 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. వారిలో అత్యధికంగా 23,214 మంది కామర్స్ లో సీట్లు పొందారు. తర్వాత స్థానం ఫిజికల్ సైన్స్ లో 14,394 మంది సీట్లు పొంందారు.

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ ఆన్ లైన్ సర్విసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడతలో 56,147 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. వారిలో అత్యధికంగా 23,214 మంది కామర్స్ లో సీట్లు పొందారు. తర్వాత స్థానం ఫిజికల్ సైన్స్ లో 14,394 మంది సీట్లు పొంందారు. గురువారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి, దోస్త్ బృందంతో కలిసి మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను, అలాగే రెండో విడత షెడ్యూల్‌ను వెల్లడించారు. మొత్తం సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 36,302 మంది ఉండగా, అబ్బాయిలు 19,845 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 777 ప్రభుత్వ, యూనివర్శిటీ కాలేజీల్లో 3,60,709 సీట్లుండగా అందులో 56,147 సీట్లు భర్తీ అయ్యాయి. 116 ప్రభుత్వ కాలేజీల్లో 50,760 సీట్లకు గానూ 8,079 మందికి సీట్లు లభించాయి. 36 ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో అత్యధికంగా 19,774 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీల్లో అత్యధికంగా 577 కళాశాలలు ఉన్నప్పటికీ, కేవలం 16,633 మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ సీట్లు పొందడం గమనార్హం. యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లోని 3,950 సీట్లకు గానూ 3,495 సీట్లు భర్తీ అయ్యాయి
ఒక్కరూ చేరని కాలేజీలు 79:
రాష్ట్రవ్యాప్తంగా 79 కాలేజీల్లో ఒక్కరూ చేరలేదన్నారు. అత్యధికంగా 99.50 శాతం మార్కులతో దోస్త్ లో మొదటి ర్యాంకు సాధించిన పబ్బ స్రుజన ఫిజికల్ సైన్స్ కోర్సు ఎంచుకుని నిజాం కాలేజీలో సీటు పొందింది. రెండో ర్యాంక్ బోడపోతుల కిరణ్ గౌడ్ 99.50 శాతం మార్కులతో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో నిజాం కాలేజీలో సీటు పొందాడు. థర్డ్ ర్యాంకు ఫిజికల్ సైన్స్ లో బండి శశికుమార్ 99.50 శాతం మార్కులు, నాలుగవ ర్యాంకు ఫిజికల్ సైన్స్ లో చాకలి ఐలమ్మ యూనివర్శిటీ నుండి షేక్ సమీర 99.50 శాతం మార్కులతో నాలుగవ ర్యాంకు సాధించింది. 99.50 శాతం మార్కులతో అక్సా తరణం జహీరాబాద్ లోని ఆచార్య డిగ్రీ కాలేజీలో లైఫ్ సైన్స్ విభాగంలో 99.50 శాతం మార్కులతో ఐదవ ర్యాంకు సాధించింది. టాప్ ర్యాంకర్లలో కొందరు ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉందన్నారు.
సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం:
సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఎంపికలు ఈ నెల 15 నుండి 26 వరకు కొనసాగుతాయని, మే 30న సెకండ్ ఫేజ్ సీట్లు కేటాయింపు ఉంటుందని దోస్త్ కన్వినర్ బాలకిష్టా రెడ్డి తెలిపారు. సీటు పొందిన అభ్యర్థులందరూ తమ సీటును రిజర్వ్ చేసుకోవడానికి ఈనెల 23 లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో సీటు, రిజిస్ట్రేషన్ రద్దవుతుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, యూనివర్శిటీ కాలేజీలకు కేటాయింపులు పొందిన, ఈ పాస్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తాత్కాలికంగా అర్హులైన వారు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటు రిజర్వ్ చేయకపోతే, వారి సీటు రద్దవుతుంది. అంతేకాకుండా దోస్త్ లో వారి రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. మెరుగైన సీటు ఎంపిక కోసం చూస్తున్న అభ్యర్థులు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన తర్వాతే తదుపరి దశలో వెబ్ ఆప్షన్లను స్లైడింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. మూడో విడత కేటాయింపుల తర్వాత మాత్రమే అభ్యర్థులు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లలో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా పొందిన సీట్లను, సంబంధిత కాలేజీలకు జూన్ 20 నుంచి జూన్ 27 వరకు వెళ్లి రిపోర్ట్ చేయాలి. కాలేజీలకు హాజరుకాని అభ్యర్థుల సీటు, సెల్ఫ్ రిపోర్టెడ్ సీటు రద్దు అవుతుంది.
ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలు:
కాలేజీలు 777
సీట్లు 3,60,709
రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు 84,610
వెబ్ ఆప్షన్లు ఇచ్చింది 61,543
సీట్లు పొందిన వారు 56,147
కొన్ని కారణాలతో సీట్లు పొందనివారు 5,396
అందుబాటులో ఉన్న కోర్సుల సంఖ్య 409
సీట్లు కేటాయించని కాలేజీలు 79
కోర్సుల వారీగా:
ఆర్ట్స్ : 8,415
కామర్స్ : 23,214
జీవ శాస్త్రాలు (లైఫ్ సైన్సెస్) : 9,815
ఫిజికల్ సైన్సెస్ (భౌతిక శాస్త్రాలు) : 14,394
ఇతరులు :309
మొత్తం : 56,147
మీడియం వారిగా కేటాయింపులు
ఇంగ్లీష్ మీడియం : 54,608
తెలుగు మీడియం : 1,131
ఉర్దూ మీడియం : 396






