- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో సీజనల్ వ్యాధుల కేసులు తగ్గుముఖం.. ముందస్తు చర్యల ఫలితం అంటున్న ఆరోగ్య శాఖ
రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శనను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో (Seasonal disease) సీజనల్ వ్యాధుల నివారణ పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శనను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) పరిశీలించారు. మంగళవారం హైదరాబాద్ లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని మంత్రికి ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే సీజనల్ వ్యాధుల కేసులు తగ్గుముఖం పట్టాయని సమీక్షలో డైరెక్టర్ అఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రం లో ప్రజారోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నిర్ములనలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని మంత్రికి తెలిపారు.
సీజనల్ వ్యాధుల కట్టడిపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల్లో అవగాహనను కల్పించామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో సీజనల్ రోగాలకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రికి ఆరోగ్య అధికారులు వివరించారు. సీజనల్ కేసులు నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని సమీక్షలో ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు , ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO ఉదయ్ కుమార్, డీఎంఈ డా. నరేంద్ర కుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. రవీందర్ కుమార్, TVVP కమిషనర్ డా. అజయ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ విమలా థామస్‌లు పాల్గొన్నారు .






