Breaking News : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీల్లో సోదాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-03-10 12:21:45  IST  )

దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో(SriChaithanya Colleges) సోదాలు(Rides) జరుగుతున్నాయి.

Breaking News : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీల్లో సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో(Sri Chaithanya Institution) సోదాలు(Rides) జరుగుతున్నాయి. తెలంగాణ(Telangana), ఏపీ(AP), ఢిల్లీ(Delhi), ముంబై(Mumbai), బెంగుళూరు(Bengaluru), చెన్నై(Chennai)లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఈ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం, అధికంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు ఏకకాలంలో దేశంలోని పలు నగరాలలో ఉన్న ఈ కాలేజీలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో.. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి టాక్స్ ఎగవేస్తున్నట్టు తేల్చారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ తయారు చేసుకుని, ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ మరొక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను అవకతవకలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది. అలాగే పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. అయితే సోదాల్లో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

Next Story