రేపు గోబల్ సమ్మిట్‌కు స్కూల్ విద్యార్ధులు.. కానీ ఒక కండిషన్!

by Ramesh Naini |

తెలంగాణ రైజింగ్ గోబల్ సమ్మిట్‌కు రేపు (బుధవారం) పాఠశాలల విద్యార్ధులకు ఎంట్రీ ఇవ్వనున్నారు.

రేపు గోబల్ సమ్మిట్‌కు స్కూల్ విద్యార్ధులు.. కానీ ఒక కండిషన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గోబల్ సమ్మిట్‌కు రేపు (బుధవారం) ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్ధులకు మాత్రమే ఎంట్రీ ఇవ్వనున్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించడానికి ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎంపిక చేసిన ఆయా పాఠశాలలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎంపిక చేస్తారని, కేవలం ఎంపిక చేసిన ఈ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అనుమతిస్తున్నట్లు మంగళవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి మిగిలిన రోజుల్లో ఎవరెవరికి ప్రవేశ ఉంటుందనే విషయమై బుధవారం నాడు ప్రకటించడం జరుగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story