- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
'స్కూల్ బస్సు బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి'

దిశ, కరీంనగర్ టౌన్ : సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ స్కూల్ బస్‌ను, ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో 15 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలైన విషయం తెలిసిందే. అయితే వెంటనే ప్రభుత్వం స్పందించి పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
వచ్చే అసెంబ్లీ బడ్జెట్లో ఆర్టీసీకి ప్రత్యేక నిధులు కేటాయించి నూతన బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ స్కూల్ బస్సులు నడుపుతున్నారని.. ఫిట్‌నెస్ ఇతర మెయింటెనెన్స్ లేకపోవడంతో ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయని ఆరోపించారు. వెంటనే ఆర్టీవో, విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ బస్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.