Operation Sindoor: ఆమెలో సగం ధైర్యం ఉన్నా ఆ విషయంలో మోడీ సభలో చెప్పాలి: రాహుల్ గాంధీ

by Prasad Jukanti |

ఆపరేషన్ సిందూర్ లో మన పైలెట్లను ముందుకు పంపి వారి చేతులు కట్టేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Operation Sindoor:  ఆమెలో సగం ధైర్యం ఉన్నా ఆ విషయంలో మోడీ సభలో చెప్పాలి: రాహుల్ గాంధీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించిందని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ లో (Operation Sindoor) మన పైలెట్లను ముందుకు పంపి వారి చేతులు కట్టేశారని పాక్ సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ ను ధ్వంసం చేయొద్దని చెప్పారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే మన విమానాలు కూలాయని ఏఐఎఫ్ ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేసింది రాజకీయ నాయకత్వం అని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చ సందర్భంగా లోక్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఓ వైపు సీజ్ ఫైర్ కు తానే కారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 29 సార్లు చెప్పారని కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఖండించలేదన్నారు. ఇందిరాగాంధీలో ఉన్న సగం ధైర్యం ప్రధాని నరేంద్ర మోడీకి ఉంటే సీజ్ ఫైర్ లో ట్రంప్ ప్రమేయం లేదని, ట్రంప్ అబద్ధాల కోరు అని సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పహెల్గాం ఉగ్రదాడిలో అమాయలుకు చనిపోయారని పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని అందరూ ముక్తకంఠంతో ఖండిచారని రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ లో మన సైనికులు గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఈ పరేషన్ విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు అన్ని సహకరించాయన్నారు. భారత సైన్యాన్ని పులితో పోల్చిన రాహుల్ గాంధీ.. పులికి స్వేచ్ఛ ఉంచాలన్నారు. త్రివిధ దళాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు రాజకీయ సంకల్పం ఉండాలన్నారు. 1971 లో జరిగిన యుద్ధంలో లక్ష మంది పాక్ సైనికులను భారత్ బందీలుగా పట్టుకుందన్నారు. ఆపరేషన్ సిందూర్ 22 నిమిషాల్లో పూర్తయిందని రక్షణ మంత్రి చెప్పారు. పాక్ సైనికుల శిబిరాలపై దాడి చేయలేదని ప్రభుత్వమే చెప్పింది. ఆపరేషన్ సిందూర్ విషయంలో మన సైనికుల చేతులు కట్టివేశారు. అర్థరాత్రి 1:30 డీజీఎంవో తో మాట్లాడామని రాజ్ నాథ్ చెప్పారు. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని పాక్ తో చెప్పామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. అంటే.. పాకిస్థాన్ తో పోరాడే ఆలోచన లేదని రాజ్ నాథ్ చెప్పారు. అసలు పాకిస్థాన్ తో యుద్ధం చేసే ఆలోచననే రాజ్ నాథ్ చెప్పకనే చెప్పారన్నారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ ను ఖండించలేదని కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ఖండించాయన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్, పాక్ ను ఒక్కటిగా చూస్తున్నాయన్నారు. పహెల్గామ్ సూత్రధారి మునీర్ ట్రంప్ తో కలిసి భోజనం చేశారని విమర్శించారు.

Next Story