సౌదీ బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

by Muthe.Rajitha |

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 45 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

సౌదీ బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 45 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. మృతులంతా హైదరాబాద్ నగరానికి చెందిన వారే. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, MIM ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందాన్ని సౌదీకి పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మృత దేహాలను అక్కడే ఖననం చేయాలని, ఇందుకోసం బాధిత కుటుంబాల్లో ఇద్దరిని చొప్పున సౌదీ తీసుకు వెళ్ళాలని నిర్ణయించింది.

Next Story