- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వాయి పాపన్న గౌడ్ మనందరికీ ఆదర్శం.. జయంతి వేళ ఎమ్మెల్సీ కవిత ట్వీట్
by Kema Shiva Kumar |
భారత తొలి తెలుగు విప్లవ వీరుడు, మొదటి బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud) జయంతి నేడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత తొలి తెలుగు విప్లవ వీరుడు, మొదటి బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud) జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు నాయకులు, బీసీ నేతలు ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకుంటున్నారు. తాజాగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేళ తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. సామాజిక సమానత్వం, బహుజనులకు రాజ్యాధికారం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మనందరికీ ఆదర్శమని కొనియాడారు. తన పోరాటాలతో పాలకులను గడగడలాడించిన ఆ మహనీయుడికి ఘన నివాళులు.. జై సర్వాయి పాపన్న.. జై తెలంగాణ అంటూ కవిత ట్వీట్ చేశారు.
Next Story






