వివాహిత ఫోటో పెట్టి ‘ఐ లవ్ యూ’ అంటూ సర్పంచ్ వాట్సాప్ స్టేటస్

by Sathputhe Rajesh |   (  Updated:2023-05-05 09:21:41  IST  )

ఓ సర్పంచ్ వివాహిత ఫోటోకు ఐ లవ్ యూ అని కామెంట్ పెట్టి స్టేటస్ పెట్టడం కలకలం రేపింది.

వివాహిత ఫోటో పెట్టి ‘ఐ లవ్ యూ’ అంటూ సర్పంచ్ వాట్సాప్ స్టేటస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ సర్పంచ్ వివాహిత ఫోటోకు ఐ లవ్ యూ అని కామెంట్ పెట్టి స్టేటస్ పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. సర్పంచ్ స్టేటస్‌తో తలెత్తుకోలేక వివాహిత ఊరు విడిచి వెళ్లిపోయింది. సర్పంచ్ కారణంగా తన కుటుంబం పరువు పోయిందని మహిళ భర్త పోలీసులకు కంప్టైంట్ చేశాడు. గ్రామంలోని మహిళలపై సర్పంచ్ అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, తన భార్య ఊరు విడిచి పెట్టి వెళ్లేందుకు కారణమైన సదరు సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భర్త డిమాండ్ చేశాడు.

Next Story