మెదక్.. డ్రాలో వరించిన సర్పంచ్ పదవి

by Muthe.Rajitha |

నేడు తెలంగాణలో జరిగిన రెండవ విడత పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మెదక్.. డ్రాలో వరించిన సర్పంచ్ పదవి
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు తెలంగాణలో జరిగిన రెండవ విడత పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అదృష్టం వరించడంతో ఓ అభ్యర్థి సర్పంచ్ పదవికి ఎంపికైంది. మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్ గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించింది. గ్రామంలో మొత్తం 377 ఓట్లు ఉండగా.. కాంగ్రెస్ బలపరిచిన సునీతకు, బీఆర్ఎస్ బలపరిచిన బీమిలికి 182 ఓట్ల చొప్పున సమంగా వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి పోల్ అవగా.. ఒక ఓటు నోటాకు పడింది. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి డ్రా తీశారు. డ్రాలో కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి పేరు రావడంతో సునీతను సర్పంచ్ పదవి వరించింది.

Next Story