- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ ఎన్నికలు: CM రేవంత్ కీలక పిలుపు
సర్పంచ్ ఎన్నికలు: CM రేవంత్ కీలక పిలుపు

దిశ, వెబ్‌డెస్క్: గ్రామాన్ని అభివృద్ధి చేసేవారిని సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పిలుపునిచ్చారు. మంచోడికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాడు.. ముంచేటోడికి అవకాశం ఇవ్వొద్దని కోరారు. కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళు.. ఊరి అభివృద్ధిని ఎప్పటికీ జరుగనివ్వరు అని చెప్పారు. మీకు నిధులు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రాబోయే పదేళ్లలో పాలమూరును పసిడి పంటల పాలమూరుగా అభివృద్ధి చేసుకుందామని కోరారు. మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు.. అందుకే మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించాం.. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది.. గత పాలకులు ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు.. ఈ జిల్లా ప్రాజెక్టులను గత ప్రభుత్వాధినేత పూర్తి చేయలేదు.. సాగునీరు, తాగునీరు కోసం ఏనాడు గత పాలకులు తాపత్రయపడలేదు.. ఇప్పుడు ఎవరు అడ్డొచ్చినా ఏదీ ఆగదు.. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేసే బాధ్యత తనదని కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల్లో తమను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మక్తల్ – నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్ట్ రెండేళ్లలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు డెడ్‌లైన్ విధించారు. ఆలోపు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మొగుతదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.






