- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఊరిలో సర్పంచ్ ఎన్నికల టెన్షన్.. మాజీ ఎంపీపీ కారుకు నిప్పు
ఆ ఊరిలో సర్పంచ్ ఎన్నికల టెన్షన్.. మాజీ ఎంపీపీ కారుకు నిప్పు

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ పంచాయతీ ఎన్నికల(Sarpanch Elections) నేపథ్యంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రత్యర్థికి చెందిన ఆస్తులను ధ్వంసం చేయడం చాలా చోట్ల జరుగుతూనే ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో ఆలూరు తాజా మాజీ ఎంపీపీ పస్కా నర్సయ్య కారుకు కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి ఇంటి బయట మంటలు రావడాన్ని గమనించిన నర్సయ్య హుటాహుటిన బయటకు వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు సగానికిపైగా కాలిపోయింది. పస్కా నర్సయ్య కంప్లైంట్‌తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈనెల 14వ తేదీన రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ విడతలో 4,332 పంచాయతీలు, 38, 322 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.






