- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ అభ్యర్థులూ పారాహుషార్..! నేడో, రేపో రానున్న ఎన్నికల షెడ్యూల్
సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నేడో, రేపో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నది. దీంతో గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని నేటి సాయంత్రంలోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు.. జిల్లా, మండల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్ షెడ్యూల్ విడులవ్వగానే కోడ్ అమల్లోకి వస్తుండటంతో.. ముందుగానే పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించినట్టు సమాచారం.
వచ్చేనెల రెండో వారం నుంచి ఎన్నికలు
సర్పంచ్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్టు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చేనెల రెండో వారం నుంచి వరుసగా ఎలక్షన్స్ జరిగే అవకాశముంది. మొదటి విడత పోలింగ్ వచ్చేనెల11న, రెండో విడత 15న, మూడో విడత 19న జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటింగ్జరిగిన రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల గెజిట్‌లను పంచాయతీరాజ్డైరెక్టర్ శ్రీజన ఎన్నికల సంఘానికి సోమవారం మధ్యాహ్నం అందించారు. 31 జిల్లాలకు 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లనుఅందజేశారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలుపుతూ ఎన్నికల కమిషన్‌కు లేఖ అందించారు. దీంతో ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన పని పూర్తయింది.
నేడు ఏజీ ద్వారా హైకోర్టుకు స్పష్టీకరణ
సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హైకోర్టు చీఫ్‌జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ వెళ్లడంతో స్థానిక ఎన్నికల అంశంపై విచారణ జరగలేదు. కనీసం నేడు విచారణకు వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేశారు. కానీ లిస్ట్కాకపోవడంతో ఎన్నికల షెడ్యూల్‌విడుదల చేస్తామని ఏజీ ద్వారా కోర్టుకు విన్నవించించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు కొడంగల్ సభలో సీఎం రేవంత్ సైతం స్థానిక ఎన్నికలపై ప్రస్తావించారు. మూడు, నాలుగు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని తనకు సమాచారం ఉన్నదని స్వయంగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీల నేతలు అలర్ట్అయ్యారు. అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. పోటీ చేసే వారు పార్టీ పెద్దల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలపై ఇప్పటివరకు చాలా మందిలో అనేక అనుమానాలు తలెత్తాయి. తొలుత ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందా? లేదంటే కాంగ్రెస్ రెండేండ్ల పాలన సంబురాలు, గ్లోబల్ సమ్మిట్ పూర్తయిన తర్వాత ప్రకటిస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, మూడు నాలుగు రోజుల్లో అంటూ స్వయంగా సీఎం తెలపడంతో ముందే షెడ్యూల్ విడుదల అవుతుందని స్పష్టత వచ్చిందని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు.
బ్యాలెట్ పేపర్లు, బాక్సులు సిద్ధం
ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్‌పేపర్ల ముద్రణ పూర్తయింది. బ్యాలెట్‌బాక్సులను సైతం అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బందికి ఒక విడత శిక్షణ సైతం పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్తరువాత మరో రెండు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల పరిశీలకులకు సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు చేయాల్సిన పనులను, ఇవ్వాల్సిన సమాచారానికి సంబంధించిన ఫార్మాట్‌ను అధికారులు వారికి అందించారు. జిల్లా స్థాయిలో ఎన్నికల పర్యవేక్షణకు సిట్టింగ్ స్వ్కాడ్, జోనల్ స్వ్కాడ్, మైక్రో అబ్జర్వర్స్‌ల జాబితాను అందించాలని ఎన్నికల సంఘం అధికారులు జిల్లా పంచాయతీ ఆఫీసర్లను ఆదేశించారు. ఎన్నికల సమయంలో అక్రమాలు, అల్లర్లు, అధికార దుర్వినియోగం జరగకుండా నియంత్రించడంలో వీరు ప్రముఖ పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో వీరి నియామకంపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. వెంటనే వారి పేర్లతో జాబితాను పంపించాలని సూచించింది. వీటితో పాటుగా ఎన్నికల నిర్వహణకు ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులను ట్రెజరీలో సమర్పించాలని, వాటన్నింటికీ సంబంధించిన టోకెన్‌లను తమకు పంపించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఆ టోకెన్వివరాలన్నింటినీ పంపించి ఆ నిధులు విడుదలయ్యే విధంగా చూస్తామని ఎన్నికల అధికారులు తెలిపినట్టుగా సమాచారం.






