ఓటమి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

by Gantepaka Srikanth |

ఓటమి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

ఓటమి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికల ఫలితాల(Telangana Sarpanch Elections) వేళ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓటమిని తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి పురుగులమందు తాగింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న గ్రామస్తులు, పోలీసులు ఆమెను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. తాజాగా ఫలితాలు వెలువడుతున్నాయి.

Next Story