- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సర్థార్ పుటం పురుషోత్తమ రావు
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులకు నేడు జరిగిన ఎన్నికలు ముగిశాయి.

దిశ, వెబ్ డెస్క్ : మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులకు నేడు జరిగిన ఎన్నికలు ముగిశాయి. హైదరాబాద్ జలవిహార్ ప్రాంగణంలో అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యాన మున్నూరుకాపు సంఘం ఎన్నికలను ప్రజాస్వామిక పద్ధతిలో, పారదర్శకంగా నిర్వహించారు. ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా సర్థార్ పుటం పురుషోత్తమ రావు పటేల్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది పెంటయ్య పటేల్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా కంచె సత్యనారాయణ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల ప్రధానాధికారిగా ఐపీఎస్ మాజీ అధికారి జే.డీ.లక్మీనారాయణ, ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారి మంగపతిబాబు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఎర్రా నాగేంద్రబాబు, న్యాయ సలహాదారులు సీనియర్ అడ్వకేట్లు ఊసా రఘు, లవంగాల అనిల్ వ్యవహరించారు.
సంఘం అధ్యక్షులుగా పురుషోత్తమ రావు, ప్రధాన కార్యదర్శిగా పెంటయ్య, కోశాధికారి సత్యనారాయణల చేత ఎన్నికల ప్రధానాధికారి లక్ష్మీనారాయణ ప్రమాణం చేయించి, పత్రాలు అందజేశారు. సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా వేణుగోపాల్ పటేల్, డాక్టర్ జే.ఏన్.వెంకట్ పటేల్, చల్లా హరిశంకర్ పటేల్, మహిళా విభాగం అధ్యక్షురాలుగా బండి పద్మక్క పటేల్ ను అపెక్స్ కౌన్సిల్ నియమించి, వారికి పత్రాలు అందజేయడం జరిగింది.






