- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు.. సీఎం రేవంత్ రెడ్డికి అందిన ఆహ్వానం
కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ, కాళేశ్వరం అర్చకులు ఆహ్వానించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం (Kaleshwaram)లో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) నేతృత్వంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన అర్చకులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సరస్వతి అంత్య పుష్కరాల విశిష్టతను సీఎంకు వివరించి, ప్రారంభోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
అయితే, 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాల వేడుకలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కర స్నానాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల వద్ద తాగునీరు, రవాణా, పారిశుధ్యం, భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.






