- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : తెలంగాణ ఇంటర్లో తెలుగుకు బదులు సంస్కృతం.. ఇంటర్ బోర్డు క్లారిటీ
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) ప్రభుత్వ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు(Telugu)కు బదులు సంస్కృతాన్ని(Sanskrit) ప్రవేశపెట్టే ప్రతిపాదనను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) ప్రభుత్వ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు(Telugu)కు బదులు సంస్కృతాన్ని(Sanskrit) ప్రవేశపెట్టే ప్రతిపాదనను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్ర వివాదం చెలరేగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీల్లో తెలుగుకు బదులు సంస్కృతం ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రస్తుతం లేదంటూ ఇంటర్ క్లారిటీ ఇచ్చింది. 2024 సెప్టెంబర్‌లో ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతాన్ని ఐచ్ఛిక భాషగా అందుబాటులోకి తీసుకురావాలని TSBIE సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థుల ఆసక్తి ఆధారంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రోత్సహించాలని ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ప్రతిపాదన తెలుగు భాష స్థానాన్ని మరింత దిగజారుస్తుందని లెక్చరర్ల సంఘాలు, తెలుగు భాషా నిపుణులు, విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
దీంతో ఇంటర్ బోర్డు ఓ ప్రకటనను జారీ చేసింది. తెలుగును తొలగించి సంస్కృతాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్దం అని, తెలుగు భాషకే ఎల్లప్పుడూ తమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. సంస్కృతాన్ని కేవలం ఐచ్ఛిక భాషగా మాత్రమే ప్రవేశపెట్టాలని చూస్తున్నామని పేర్కొంది. అయినప్పటికీ, తెలంగాణలో 10వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేసిన నేపథ్యంలో, ఇంటర్మీడియట్‌లో సంస్కృతాన్ని ప్రోత్సహించడం తెలుగు భాషకు హాని కలిగిస్తుందని తెలుగు భాషా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మార్కుల కోసం 50% మంది విద్యార్థులు తెలుగు బదులు ఇతర భాషలను ఎంచుకుంటున్నారని, 90% ప్రైవేట్ కళాశాలల్లో అసలు తెలుగు అందుబాటులో లేదని లెక్చరర్ల సంఘాలు పేర్కొన్నాయి.
సంస్కృతం సులభంగా మార్కులు సంపాదించే భాషగా భావించడం వల్ల విద్యార్థులు దీన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారని, దీనివల్ల తెలుగు భాష ఎంపిక తగ్గుతోందని ఆరోపిస్తున్నారు. సంస్కృతం పరీక్షలను దేవనాగరి లిపిలో తప్పనిసరిగా రాయాలనే నిబంధన విధిస్తే ఈ ధోరణి తగ్గవచ్చని కొందరు సూచిస్తున్నారు. TSBIE అధికారుల ప్రకారం, సంస్కృతాన్ని ప్రవేశపెట్టడానికి కళాశాల ప్రిన్సిపాళ్ల నుండి ఇంకా డిమాండ్ రాలేదని, ఒకవేళ డిమాండ్ వస్తే, వచ్చే విద్యా సంవత్సరం నుండి సంస్కృతాన్ని అమలు చేసేందుకు గెస్ట్ లెక్చరర్లను నియమకానికి లేదంటే కొత్త లెక్చరర్ల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నామని బోర్డు పేర్కొంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని లెక్చరర్ల సంఘాలు ఆన్‌లైన్ రిప్రెజెంటేషన్ పంపాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ నిర్ణయంపై విచారం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను మాతృభాష నుండి దూరం చేయడం సరికాదని అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.






