- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి ఊరెళుతూ తాళం వేసే ఇండ్లే టార్గెట్
సంక్రాంతి ప్రయాణం దొంగలకు కలిసొచ్చే కాలంగా మారుతోంది. తాళంవేసి ఊరెళితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, ప్రజలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు.

దిశ, రేవల్లి: సంక్రాంతి ప్రయాణం దొంగలకు కలిసొచ్చే కాలంగా మారుతోంది. తాళంవేసి ఊరెళితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, ప్రజలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. పోలీస్ యంత్రాంగం సోషల్ మీడియా, టీవీలు, పేపర్ల ద్వారా సైబర్ నేరగాళ్లపై, దొంగల బారిన పడుకుండా అవగాహన కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటికి తాళంవేసి, ఊరెళ్లాక దొంగలు పడ్డారని, పోలీస్ స్టేషన్ల కు వస్తే ఎటువంటి లాభం ఉండదని పోలీసులు పేర్కొంటున్నారు. తాము సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే దొంగల బారిన పడటం ఖాయమని అంటున్నారు.
ప్రచారమే.. వారికి సమాచారం
ఈ మధ్యకాలంలో ఊరెళ్లేసమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఓ డేట్ ఫిక్స్ చేసి తామంతా కుటుంబంతో సహా టూర్ వెళుతున్నామంటూ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి చెప్పడం, వాట్స్ యాప్, ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టా, వంటి సోషల్ మీడియాల్లో ప్రచారం చేసుకోవడంతో దొంగలకు సమచారం ఇచ్చినట్టు అవుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. పండుగా సంబురంలో ఉన్న ప్రజలకు ఫేక్ యాప్ ల నుంచి ఫోన్ కాల్ చేస్తూ ఇంట్లో వారికి యాక్సిడెంట్ అయిందని, అర్జెంటుగా డబ్బు పంపించాలని, లాటరీ తగిలిందని, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని, ముందుగా డబ్బు చెల్లించాలని బురిడీ కొట్టించే అవకాశం ఉన్నదని పోలీసులు చెబుతున్నారు.
సీసీ కెమెరాలపై కొట్టొచ్చిన నిర్లక్ష్యం..
గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలపై అవగాహన కల్పించడంతో అధికారులు, పోలీసులు విఫలమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొంతమాత్రం అవగాహన కల్పిస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. గ్రామాల్లోని ప్రధాన చౌరస్తా, జనసంచార ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంంటే, చోరీలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు చోరీలు చేసినా, వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా గ్రామంలో ఉన్న వారంతా చందాలు వేసుకునైనా సరే ప్రధాన చౌరస్తాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, తాళం వేసిన ఇండ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారని పేర్కొంటున్నారు.
ఉరేళ్లే ప్రజలకు పోలీసులు సూచన..
విలువైన వస్తువులు, నగదు నగలు ఇంట్లో ఉంచుకోవద్దని, ఊరికి వెళ్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని పోలీసులు పేర్కొంటున్నారు. ఇంటి ఆవరణలో లేదా, ఏదైనా గదిలో లైట్ వేసి ఉంచాలని, నమ్మకమైన వ్యక్తిని వాచ్ మెన్ గా పెట్టుకోవాలని చెప్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటిని మొబైల్ అనుసంధానం చేసుకుంటే, ఎప్పుడైనా తమ ఇంటిని చూసుకోవచ్చని, దొంగలను పసిగట్టవచ్చని సూచిస్తున్నారు. ఇంటి తాళం బయటికి కనిపించకుండా చూసుకోవాలని, ఊరికి వెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.






