- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో నీల్వాయికి బండి సంజయ్.. మధూకర్ కుటుంబానికి పరామర్శ
సద్దుల బతుకమ్మ రోజు ఓ మహిళలను కులం పేరుతో దూషించాడని మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ మండలాధ్యక్షుడు ఏట మధూకర్ (Yeta Madhukar)పై పోలీసులు అట్రాసిటీ కేసు (Atrocity Case) నమోదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సద్దుల బతుకమ్మ రోజు ఓ మహిళలను కులం పేరుతో దూషించాడని మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ మండలాధ్యక్షుడు ఏట మధూకర్ (Yeta Madhukar)పై పోలీసులు అట్రాసిటీ కేసు (Atrocity Case) నమోదు చేశారు. అయితే, తాను ఆ అవమానాన్ని భరించలేక మాధూకర్ సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే మధూకర్ మృతికి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే పోలీసులు అక్రమ కేసు బనాయించారంటూ కుటుంబ సభ్యులు, బీజేపీ (BJP) శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి నీల్వాయి (Neelvai)-చెన్నూర్ (Chennur) ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
అదేవిధంగా స్థానిక ఎస్సైపై కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించే వరకు మృతదేహాన్ని తీసేదేలేదంటూ భీష్మించుక కూర్చున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కోనసాగుతుందన్నారు. అయితే, కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మధూకర్ స్వగ్రామం నీల్వాయి (Neelvai)కి చేరుకుని ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మధుకర్ కుటుంబంతో పాటు మేమనపల్లి మండల బీజేపీ శ్రేణులకు భరోసా ఇవ్వనున్నారు.






