- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్‌ని కలిసిన సందీప్ రెడ్డి వంగా.. సీఎం సహాయనిధికి విరాళం ఇచ్చిన సోదరులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కలిశారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అతని సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున (CMRF) సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని వారు చెక్ ద్వారా సీఎంకు అందజేశారు. ఈ మేరకు సందీప్ రెడ్డి వంగా, అతని సోదరుడిని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి సందీప్ రెడ్డి వంగా విరాళాన్ని అందించినట్లు తెలుస్తోంది.
Next Story






