ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-13 04:33:56  IST  )

పాలనా పరమైన వ్యవహాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా (Sandeep Kumar Sultania) నియమించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు (CS Rama Krishna Rao) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఉదయం సందీప్ కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

కాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆర్థిక శాఖ (Department of Finance) ముఖ్య కార్యదర్శిగా కె.రామకృష్ణా రావు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. సీనియర్ ఐఏఎస్ శాంతి కుమారి (Shanthi Kumari) ఇటీవలే పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో కొత్త సీఎస్‌గా రామకృష్ణా రావును ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్ట్‌లో సందీప్ కుమార్ సుల్తానియాకు నియమిస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story