- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లు రవి గెలుపు కోసం రక్తం దార పోశా.. సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి(Mallu Ravi)పై ఆ పార్టీ సొంత నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి(Mallu Ravi)పై ఆ పార్టీ సొంత నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సంపత్ కుమార్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అలంపూర్‌లో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు వివారించాను. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయలేదు. ఎంపీగా మల్లు రవి అఫీషియల్‌గా మీటింగ్ పెడితే బాగుండేది. అన్ అఫిషియల్‌గా బీఆర్ఎస్ నాయకులతో మల్లు రవి మీటింగ్ పెట్టాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయుడిని పూల బొకేలు, శాలువలతో సత్కరించాడు. ఎమ్మెల్యే విజేయుడు ఎప్పటికైనా కాంగ్రెస్‌లోకి వచ్చే వ్యక్తి అని మల్లు రవి కామెంట్స్ చేయడం బాధ అనిపించింది. అత్యుత్సాహంతో ఏదో చేయబోయి మల్లు రవి ఇరుక్కున్నాడు. ఆయన్ను ఎంపీగా గెలిపించడం కోసం రక్తం దార పోశాను. ఇప్పుడు ఆయనకు అవేమీ గుర్తులేవు అని సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.






