- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పాలనలో ‘బంధు పాలన’ నడిచింది! సంపత్ కుమార్ ఆరోపణలు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బంధు, కేటీఆర్ బంధు, హరీశ్ బంధు, సంతోష్ బంధు, కవిత బంధు పాలన ఉండేదని సంపత్ కుమార్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ మారకపోతే ప్రజలు ఇంకా ఛీ కొడతారని, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఆయన దిట్ట, నిజాలను అబద్ధాలుగా మార్చడం కేటీఆర్ కి అలవాటని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శలు గుప్పించారు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గవర్నమెంట్ సొమ్ముతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసేందుకు వేరే రాష్ట్రాల వారిని ఫ్లైట్స్ లో రప్పించారని, కేసీఆర్ ఫోజులు కొట్టేందుకు తెలంగాణ పైసలను పంజాబ్‌లో పంచారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బంధు, కేటీఆర్ బంధు, హరీశ్ బంధు, సంతోష్ బంధు, కవిత బంధు పాలన ఉండేదని, తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి దోచి పెట్టారని సంపత్ కుమార్ ఆరోపించారు.
కేటీఆర్ నీచ రాజకీయాలు
చిల్లర రాజకీయాలు చేయడం కేటీఆర్ మానుకోవాలని, ఆయన అబద్ధాలను నిజాలుగా వక్రీకరిస్తున్నారని సంపత్ ధ్వజమెత్తారు. కేటీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, మీడియాకి హెడ్ లైన్స్ కోసమే కేటీఆర్ తాపత్రయమన్నారు. రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదని, రాహుల్ కి ఆస్తులు కావాలంటే తెలంగాణ కార్యకర్తలు తలా కొంచెం వేసుకుంటే వెయ్యి కోట్లు అవుతాయని రేవంత్ రెడ్డి అంటే ఆ మాటలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారని సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






