- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్-1పై సాక్ష్యం ఉంటే రేవంత్ లేదా నేనే సిద్ధం: కేటీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ సవాల్
గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలకు బదులుగా ఒక్క సాక్ష్యం చూపించిన సీఎం రేవంత్ రెడ్డి, లేదా తాను దేనికైనా రెడీ అని సంపత్ కుమార్ సవాల్ విసిరారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తేరు మైదానానికి ఓ చరిత్ర ఉందని దాన్ని (KTR) కేటీఆర్ అబద్దాలకు అడ్డగా మార్చి ఈ రోజు నడిగడ్డ ప్రతిష్టను దిగజార్చు పోయాడని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ (AICC Secretary and former MLA Sampath Kumar) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. నిన్న జరిగిన గద్వాల్ సభ అబద్ధాలకు కేంద్రంగా ఉందని, సభ అట్టర్ ప్లాఫ్ అయిందన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అభివృద్ధిపై ఆలోచన లేదు అని వారికి ఫ్యూడలిస్ట్ ,శాడిస్ట్ రాజకీయాలు చేయడమే తప్ప ప్రజా సమస్యలపై అవగాహన లేదన్నారు. నిన్న సభలో కేటీఆర్ మాట్లాడుతూ గురుకుల హాస్టల్‌లో ఎలుకలు దూరుతున్నాయని చేసిన విమర్శను సంపత్ కుమార్ తిప్పి కొట్టారు. కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి రోజుల్లో నేను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి కొట్లాడి అలంపూర్ నియోజకవర్గానికి అత్యధిక గురుకులాలను తీసుకువచ్చామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టలేదన్నారు.
పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి కూడా మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. ఎందుకంటే ఆ రోజు టీఆర్ఎస్ పరిపాలనలోనే ఆ కంపెనీకి స్వయంగా కేటీఆర్ చేతుల మీదుగా 9 పర్మిషన్లు ఇచ్చారని.. అప్పుడు బుద్ధి లేదా కేటీఆర్ అని ప్రశ్నించారు. దళితులు బీసీల గురించి మాట్లాడే నైతికత కేటీఆర్‌కి లేదని అన్నారు. అలాగే, గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలకు బదులుగా ఒక్క సాక్ష్యం చూపించిన సీఎం రేవంత్ రెడ్డి, లేదా తాను దేనికైనా రెడీ అని సంపత్ కుమార్ సవాల్ విసిరారు.






