బీఆర్ఎస్ నేతలు దేశద్రోహులు.. ఉగ్రవాదులు: సామ రామ్మోహన్‌రెడ్డి

by Ajay Maddhiboyina |

దేశద్రోహులు.. ఉగ్రవాదులు ఈ బీఆర్ఎస్ నేతలు అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాలబెట్టడం, ధ్వంసం చేయడం, హింసాకాండ రేపడం.. ఇదే కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి విధానమని తెలిపారు.

బీఆర్ఎస్ నేతలు దేశద్రోహులు.. ఉగ్రవాదులు: సామ రామ్మోహన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశద్రోహులు.. ఉగ్రవాదులు ఈ బీఆర్ఎస్ నేతలు అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాలబెట్టడం, ధ్వంసం చేయడం, హింసాకాండ రేపడం.. ఇదే కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి విధానమని తెలిపారు. వారికి అధికారం ఇవ్వకుంటే, వారి రాజకీయ నిరసనలకు ప్రజలు, రైతులు కలిసి రాకుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కూడా వెనుకారని పేర్కొన్నారు. కేసీఆర్ దత్తపుత్రుడు, కేటీఆర్ సోదరుడు బాల్క సుమన్ చేస్తున్న విధ్వంస కుట్రలు వింటే ప్రజలకు వీరి నిజస్వరూపం మరోసారి తెలుస్తుందని తెలిపారు.

‘సింగరేణి జీఎం ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ కాలబెడతారంట, రాష్ట్రంలో రైల్వే లైన్లు కూడా ధ్వంసం చేస్తారంట. వీళ్లు మనుషులా? పాకిస్థాన్ ఉగ్రవాదులా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న కాలంలో రెచ్చగొట్టి వందలమంది ప్రాణాలు తీసిన హంతకులు అని.. ఇప్పుడు ప్రశాంతంగా దేశానికే దిక్సూచిగా తెలంగాణ ఎదుగుతుంటే విధ్వంసాలకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఉగ్రవాదుల నుంచి ప్రజలు అలర్ట్ కావాలని.. ఈ చీడపురుగులను శాశ్వతంగా తెలంగాణకు దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. పోలీసులు వెంటనే ఈ చీడ పురుగులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు

Next Story