- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sama Rammohan Reddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గోదాట్ల దూకినట్టే: సామ
కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్ణయంపై కాంగ్రెస్ నేత సెటైర్ వేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ జల హక్కుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బనకచర్ల (Banakacharla) అంశంలో ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జల హక్కులపై వాస్తవాలను బయటపెట్టేందుకు నేనే స్వయంగా మీడియా ముందుకు వస్తానని తనను ఆసుపత్రిలో పరామర్శించేందుకు వచ్చిన పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) విమర్శలు గుప్పించారు. గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కేసీఆర్ మాత్రం ప్రెస్ మీట్ పెడతా అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన సామ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బతుకు గోదాట్లో దూకినట్లే.. కృష్ణాలో మునిగినట్లేననే విషయం బీఆర్ఎస్ నేతలకు తెలియదన్నారు. అందుకే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తే కేసీఆర్ మాత్రం నేను ప్రెస్ మీట్ పెడతానని చెబుతున్నారని ఈ నిర్ణయంతో గులాబీ నేతలు తలగొక్కుంటున్నారని సెటైర్ వేశారు. ప్రెస్ మీట్ అయితే అడిగేవాళ్లు ఉండరు. చెప్పాల్సింది చెప్పి దులుపుకుని పోవచ్చనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సామ విమర్శించారు. ఎవరైనా మీడియా ప్రతినిధి ప్రశ్న వేస్తే ‘ఏ పేపర్ నీది.. నెత్తా-కత్తా ఏం తెల్సు నీకు.. నాకంటే తెల్వి ఉందా నీకు’ అంటూ రిపోర్టర్ పైనే కేసీఆర్ ఎదురుదాడి చేసుడు మనకు తెలిసిందే కదా అంటూ పోస్టు చేశారు.






