- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ మంత్రి లోకేశ్‌తో కేటీఆర్ సీక్రెట్ మీటింగ్.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్.. ఇటీవల పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేతలను కలిశారని కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి, కృష్ణాలో తెలంగాణ వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే.. బనకచర్ల ప్రాజెక్టు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కేటీఆర్ మాత్రం ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తో సీక్రెట్ మీటింగ్స్ జరిపారని ఆరోపించారు. కేటీఆర్‌తో నారా లోకేశ్ మంతనాలు ఒక్కసారి కాదు.. రెండు సార్లు కలిశారు.. అని అన్నారు. ఆ రహస్య మంతనాలు ఎవరికి లబ్ది చేయడానికో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై కేటీఆర్ స్పందించి లోకేశ్‌ను కలవలేదంటే అప్పుడు స్పందిస్తాను.. తప్పు అని అంటే వివరాలు అన్నీ బయటపెడతా.. అని హాట్ కామెంట్స్ చేశారు. తెరవెనక తెలంగాణకు కుట్రలు చేస్తుంది ఎవరు? వీరి భేటితో అర్థం అవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కి కేటీఆర్ ప్రతిసవాళ్లు విసురుతున్నారు.. అన్ని అంశాల పై సోమవారం అమరవీరుల స్థూపం వద్దకు రా చర్చ చేద్దాం.. అని సవాల్ విసిరారు. రైతుల సంక్షేమం మీద మాట్లాడేందుకు మీకు సిగ్గు ఉండాలని, పదేళ్లలో రైతులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.






