- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త పార్టీ పెట్టాలనే కవిత ఆలోచనను స్వాగతిస్తున్నాం: సామా రామ్మోహన్ రెడ్డి
కొత్త పార్టీ పెట్టాలనే కవిత ఆలోచనను స్వాగతిస్తున్నాం: సామా రామ్మోహన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపిన వారిపై పోరాడే స్వేచ్ఛ కూడా ఆమెకు లేకుండా పోయిందని టీపీసీసీ అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. రహస్య ఒప్పందమే లేకుంటేబీజేపీపై బీఆర్ఎస్ఎందుకు?మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. బుధవారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత కొత్తగా పార్టీ పెట్టబోయే ఆలోచనను స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో మహిళలకు మొదట్నించే అన్యాయం జరుగుతుందని చెప్పి, తాను ఏ వేదిక దొరిక మహిళలు, బీసీ, సామాజిక తెలంగాణ అంశమైన, ప్రభుత్వ సంక్షేమాల విషయమైన ఈ మధ్య కాలంలో అన్ని మీడియాలలో ప్రసగించిందని చెప్పారు. గత పదేళ్లుగా తెలంగాణ జరిగినటువంటి అన్యాయాన్ని పరోక్షంగానే కవిత, సొంత పార్టీ, తండ్రి కేసీఆర్ పై తన అసంతృప్తిని పరోక్షంగా ఎక్కడ వేదిక దొరికన అవకాశం వదిలిపెట్టకుండా మాట్లాడడం అందరూ విన్నారని పేర్కొన్నారు.
ఇందుకు ఉదహరణలు కూడా మాట్లాడుకోవచ్చని, అందులో భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని, సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యనించిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ హయాంలో మహిళలకు, బీసీలకు అన్యాయం జరిగిందని కవిత ఒప్పుకున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. గత పది సంవత్సరాల్లో సామాజిక తెలంగాణ నిర్మించలేకపోయామని ప్రతి వేదిక నుంచి తన తండ్రి పాలనపై ఆమె తన అసంతృప్తిని బాహాటంగానే బయట పెట్టుకున్నారన్నారు. కేసీఆర్పాలనలో భూస్వాములకే రైతుబంధు వచ్చిందన్న వ్యాఖ్యలైనా, బీసీలకు అన్యాయం జరిగిందన్న వ్యవహారమైన, మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు రాలేదన్న కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని సామా పేర్కొన్నారు. కేసీఆర్ నియంత పోకడలను కవిత ఫాలో కావద్దు అని, అలా ఫాలో అయితే కవిత పెట్టబోయే పార్టీ నీ తెలంగాణ ప్రజలు సమాధి చేస్తారన్నారు. తానుపెట్టబోయే పార్టీని బ్రుణ హత్య కాకుండా చూసుకునే బాధ్యత కవితదే అని అన్నారు. సొంత పార్టీ, కుటుంబంపై తోడబుట్టిన సోదరుడు, కన్న తండ్రిపై కవిత అసంతృప్తితో రగిలిపోతుందన్నారు.
కవితను జైల్లో వేసిన బీజేపీతో బీఆర్ఎస్ చేస్తున్న నాటకాలను ఆమె జీర్ణించుకోలేక పోతోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తుందని, అందుకే బీజేపీ సంగతి చూస్తా అని పిడికిలి ఎత్తి శపధం చేసిన కవిత నోరును బీఆర్ఎస్ నొక్కుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆస్తుల్లో కేటీఆర్కి వాటా ఇచ్చారు, తప్ప కవిత పిల్లలను పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ లోని పురుషాధిక్యాన్ని ఆమె తట్టుకోలేకపోతున్నారని, అందుకే తన సొంత మనుషులే తనను అణగదొకుతున్నారని చిట్ చాట్ లో చెప్పారని సామా తెలిపారు. కవితను ఏకాకి చేసేందుకే బీఆర్ఎస్ కుట్ర చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ఆ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోలేదన్నారు. అందుకే ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ పెడుతున్నారన్నారు. తన అసంతృప్తిని లేఖల ద్వారా తన తండ్రికి కవిత పంపించారని, అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో పార్టీ పెట్టడమే శరణ్యం అని కవిత భావిస్తున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై బురద చల్లితే మిమ్మల్ని ఆ దేవుడే చూసుకుంటాడని,అందుకే ఇప్పుడు బీఆర్ఎస్పార్టీ ముక్క చెక్కలయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నది అని తమకు విశ్వసనీయ సమాచారం ఉందని, కాదని కవితనే చెప్పాలని ఈసందర్భంగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.






