కాంగ్రెస్‌లో సామ రామ్‌మోహన్ రెడ్డికి కీలక పదవీ

by Disha Web Desk 14 |
కాంగ్రెస్‌లో సామ రామ్‌మోహన్ రెడ్డికి కీలక పదవీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల వేళ మరో కీలక నియామకం చేపట్టింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల చైర్మన్‌గా సామ రామ్ మోహన్ రెడ్డిని నియమించారు. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, సామ రామ్‌మోహన్ రెడ్డి టీపీసీసీ అఫిషియల్ స్పోక్స్ పర్సన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆయన చురుకుగా ఉంటారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది.

Next Story

Most Viewed