V.C SAJJANAR: న్యూ ఇయర్ అని డ‌బ్బులు ఎక్కువ అడుగుతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-31 03:20:58  IST  )

న్యూఇయర్ రోజు క్యాబ్ ఆటో డ్రైవర్స్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? ఇలా కంప్లైంట్ చేయండి

V.C SAJJANAR: న్యూ ఇయర్ అని డ‌బ్బులు ఎక్కువ అడుగుతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి
X

దిశ‌, వెబ్ డెస్క్: డిమాండ్ పెరిగిందంటే ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు ధ‌ర‌లు అమాంతం పెంచేస్తారు. పండ‌గలు, ప‌బ్బాలు వ‌చ్చాయంటే ఎక్క‌డికైనా వెళ్లాలి అంటే భ‌య‌ప‌డాల్సిందే. ఇక నేడు డిసెంబ‌ర్ 31 కావ‌డంతో ఎక్క‌డ చూసినా సెల‌బ్రేష‌న్స్ క‌నిపిస్తుంటాయి. బార్లు, ప‌బ్బులు కిట‌కిట‌లాడుతుంటాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో క్యాబ్ డ్రైవ‌ర్లు క‌స్ట‌మ‌ర్లను దింపేందుకు ఎక్కువ డిమాండ్ చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ముందుగానే అలాంటి వారికి హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ వార్నింగ్ ఇచ్చారు.

న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్ హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ +91 94906 16555 కు పంపించాలని సూచించారు.

Next Story