- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cyber Trap: అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల పేరిట 'సైబర్' వల.. 'ఉద్గమ్' పోర్టల్‌పై సజ్జనార్ ట్వీట్
అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల పేరిట 'సైబర్' వల.. జర భద్రం అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల పేరిట 'సైబర్' వల.. జర భద్రం అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లను తిరిగి పొందేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ‘ఉద్గమ్’ (UDGAM) పోర్టల్‌ను సైబర్ కేటుగాళ్లు తమ మోసాలకు ఆయుధంగా మలుచుకున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన ప్రజలకు జాగ్రత్త సూచనలు చేస్తూ కీలక సమాచారం పంచుకున్నారు. అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లు వాపసు అందిస్తామంటూ కేటుగాళ్లు ఆర్‌బీఐ లేదా బ్యాంకుల పేరుతో నకిలీ సందేశాలు పంపిస్తూ, వాటిలో ఇచ్చిన లింకులు క్లిక్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీంతో ప్రజల బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నట్లు తెలిపారు.
అధికారిక లింక్ ఒక్కటే: https://udgam.rbi.org.in , దీని తప్ప ఇతర లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సజ్జనార్ సూచించారు. ఆర్‌బీఐ లేదా బ్యాంకుల పేరుతో వచ్చే లింకులను నమ్మడం ప్రమాదకరం. కేటుగాళ్లు ఇదే మార్గంలో మోసాలు చేస్తున్నారు. ఆర్‌బీఐ ఎప్పుడూ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అడగదని, అలాంటి సమాచారాన్ని ఎవరికీ పంచొద్దని హెచ్చరించారు. సందేహాస్పద మెసేజ్ వచ్చినప్పుడు నేరుగా సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలని సూచించారు. మోసపోతే: వెంటనే 1930కి కాల్ చేయాలని, లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.






