- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reels On Tracks: సోషల్ మీడియా మానసిక రోగులు! వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ అవ్వడం కోసం కొంత మంది యువత ఈ మధ్య విచిత్రమైన వీడియోలు క్రియేట్ చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Social media) సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ అవ్వడం కోసం కొంత మంది యువత ఈ మధ్య విచిత్రమైన వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మరి కొందరు రీల్స్ (Reels) మోజులో పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు, ఫ్యూస్ కోసం ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ ఖాతా వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఒక వీడియో పోస్ట్ చేశారు. వీడియో లో ఓ యువకుడు రైలు ట్రాక్ మధ్యలో పడుకోని ప్రమాదకరంగా రీల్స్ చేశాడు. రైలు పట్టాల మధ్య పడుకున్న సమయంలో వేగంగా వస్తున్న రైలు అతడిపై నుంచి వెళ్తోంది. ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత అతను ఏదో సాధించినట్లు నవ్వుతూ సేఫ్‌గా పైకి లేచి వీడియో షూట్ ఆపేస్తాడు.
దీనిపై వీసీ సజ్జనార్ వీడియో షేర్ చేస్తూ.. ‘పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే.. సోషల్ మీడియాలో పేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు. ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి ఉండటం లేదు. సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేకుంటే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని.. వీళ్లు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే ఆస్కారం ఉంది’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టిజన్‌లు రకరకాలుగా స్పందించారు. ఇటువంటి రీల్స్ చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఇలా వీడియోలు చేస్తే కటకటాల పాలైతాం అనే భయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. కాగా, గతంలో ఒడిశా, యూపీ రాష్ట్రాల్లో ఇలా రైల్వే ట్రాక్ మధ్యలో పడుకోని రీల్స్ చేసిన ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.






