Free bus: ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. ఆధార్ లేకున్నా ఇవి ఉంటే చాలంటున్న ఎండీ సజ్జనార్

by Malleboina Mahesh |

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (మహాలక్ష్మి పథకం) కల్పించింది.

Free bus: ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. ఆధార్ లేకున్నా ఇవి ఉంటే చాలంటున్న ఎండీ సజ్జనార్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ (Free bus travel) సౌకర్యం (మహాలక్ష్మి పథకం) కల్పించింది. ఈ పథకం తెలంగాణ మహిళలకు అందరికీ వర్తింపజేశారు. రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఆద్వర్యంలో నడిచే అన్ని పల్లే వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఆధార్ కార్డుతో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం (Free bus travel) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. కాగా ఈ ఉచిత బస్సు పథకం పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా బస్సులో ప్రయాణించే మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్ గుర్తింపు, డ్రైవింగ్ లైసెన్స్‌లను చూపించి ఉచిత టికెట్ పొందవచ్చని స్పష్టం చేశారు. కాగా ఓ నెటిజన్ ఆధార్ కార్డు మాత్రమే వ్యక్తి గుర్తింపు ఐడీ కాదని సోషల్ మీడియాలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (RTC MD Sajjanar)ను ట్యాగ్ చేసి ప్రశ్నించగా అతనికి సమాదానంగా ఈ విషయం చెప్పారు. ఆధార్ కార్డు లేని వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లను చూపించి ఉచిత టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Next Story