- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట.. మహిళ రీల్స్ పై సజ్జనార్ ఫైర్
ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన రీల్ పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. రీల్ వీడియోలో మహిళ తన కన్న బిడ్డలను బావి అంచులపై నిలబెట్టి డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన రీల్ పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. రీల్ వీడియోలో మహిళ తన కన్న బిడ్డలను బావి అంచులపై నిలబెట్టి డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా ఇద్దరు పిల్లలను తన చేతిలో పట్టుకుని బావిలోకి వదులుతున్నట్టు పట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన సజ్జనార్ మహిళ తీరుపై మండిపడ్డారు. కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదని అది మూర్ఖత్వం అని పేర్కొన్నారు. ఆత్మహత్యాసదృశ్యం అని అన్నారు. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే సమాజం ఎంటు పోతుందో అర్థం కావడంలేదన్నారు. సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించవద్దని అన్నారు.






