- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: ఉన్నపళంగా కుంగిపోయిన రోడ్డు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హిమాయత్‌నగర్‌లోని స్ట్రీట్ నెంబర్-5లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా రోడ్డు 10 అడుగుల లోతులోకి కుంగిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన భారీ ట్రక్కు అందులో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






