- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యాన విశ్వవిద్యాలయంలో కుంకుమపువ్వు సాగు
నాబార్డ్ ఆర్థిక సాయంతో ఏరోపోనిక్ పద్ధతిలో వనపర్తి జిల్లాల్లోని మోజర్ల ఉద్యాన కళాశాలలో చేపట్టిన ఏరోపోనిక్ పద్ధతిలో కుంకుమపువ్వు సాగు సత్ఫలితాలను ఇచ్చిందని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నాబార్డ్ ఆర్థిక సాయంతో ఏరోపోనిక్ పద్ధతిలో వనపర్తి జిల్లాల్లోని మోజర్ల ఉద్యాన కళాశాలలో చేపట్టిన ఏరోపోనిక్ పద్ధతిలో కుంకుమపువ్వు సాగు సత్ఫలితాలను ఇచ్చిందని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి వెల్లడించారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రయోగశాలలో ఈ పద్ధతిలో కుంకుమపువ్వు రావడం మొదలైంది. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో లో గత రెండు నెలలుగా చేస్తున్న పరిశోధన లో కుంకుమ పువ్వులు వచ్చాయి.
దీంతో రాష్ట్రంలో సైతం నియంత్రిత వాతావరణంలో కాశ్మీర్లో మాత్రమే పండే కుంకుమపువ్వును ఇక్కడ పండించవచ్చని ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిరూపించారు. త్వరలోనే పూర్తిస్థాయి వివరాలు ఆసక్తి ఉన్నవారికి అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించే విధంగా వర్సిటీ పరిధిలో పరిశోధనలు చేపడుతున్నాం. అందులో భాగంగా కాశ్మీర్లో చల్లని వాతావరణంలో పండే కుంకుమపువ్వును విశ్వవిద్యాలయం పరిధి కళాశాలలో పైలెట్ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది.
ఈ నూతన టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ త్వరలోనే పరిచయం చేస్తామని, ఉద్యాన పరిశోధన సంస్థలలో సాఫ్రాన్ మోడల్ ల్యాబ్లు ఏర్పాటు చేసి స్థానిక రైతులకు శిక్షణను ఇస్తామన్నారు. ఈసందర్బంగా నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ్ భాస్కర్ వివరిస్తూ ఆసక్తి ఉన్న రైతులకు, సహాయకులకు గ్రామీణ యువతకు అందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, గ్రామీణ ఆదాయాల పెంపుకు ఇటువంటి నూతన ఆవిష్కరణ లను ప్రోత్సహిస్తామని తెలిపారు.
రైతుల ఆదాయం మెరుగు పరచాలని ఉద్దేశంతోనే నూతన పరిజ్ఞానాన్ని అందరికీ అందించే పథకాలు చేపడుతున్నాం. రాష్ట్రంలో కుంకుమపువ్వు సాగు సాధ్యసాద్యాలపై నిగ్గు తేల్చేందుకుగాను ఉద్యాన వర్సిటీకి కుంకుమపువ్వు ప్రాజెక్టు నిధులు అందించాం. కుంకుమపువ్వు ఏరోపోనిక్ పద్ధతిలో ఇక్కడ వచ్చింది. వీటిపై ఔత్సాహకులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. గ్రామీణ అభివృద్ధికి, రైతుల ఆదాయాలు పెంపొందించేందుకు ఉపయోగపడే అన్ని టెక్నాలజీలను కూడా ప్రోత్సహిస్తామన్నారు.
అనంతరం ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు ప్రొఫెసర్ పిడిగం సైదయ్య మాట్లాడుతూ నాబార్డ్ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో ఏరోపోనిక్ పద్ధతిలో కుంకుమ పువ్వు సాగు అనే ప్రాజెక్టును చేపట్టాం. కాశ్మీర్లో సంప్రదాయకంగా కుంకుమపువ్వు పండే ప్రాంతంలో ఉన్న చల్లని వాతావరణం, గాలిలో తేమ పరిస్థితులను ప్రధానంగా మన ప్రాంతంలో ప్రయోగశాలలో కల్పించి కుంకుమపువ్వు పండించగలిగాం.
ప్రస్తుతం దిగుబడి, నాణ్యత బాగుంది. ఈ పంట లో దశలవారీగా మేము కృత్రిమంగా కల్పించిన వాతావరణ పరిస్థితులు, పండించే విధానం, తదితర వివరాలు ఎవరైనా కావాలనుకుంటే ఉచితంగా అందిస్తాం. కళాశాలలో సంప్రదించవచ్చన్నారు.






