- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్ల అవినీతి వాళ్లే బయటపెట్టుకున్నారు.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవునీతిని వాళ్లే ఒకరిది ఒకరు బైట పెట్టుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవునీతిని వాళ్లే ఒకరిది ఒకరు బైట పెట్టుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. బొగ్గు కుంభకోనంలో అవినీతి జరిగిందా లేదా అనేదాని మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏ విధంగా అవినీతి జరిగిందో బయటకు రావాలని అన్నారు. ఇలాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా ఎదుర్కుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో తాకిన దెబ్బతోనే ఏదో డ్రామా ఆడాలని అనుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని వదిలేశారని అన్నారు. బతుకమ్మ చీరలు మొన్న గ్రామాల్లో పంచితే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని నగరంలో పంచుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కు నిజాయితీ ఉంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.






