- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎరువులపై అవగాహన లేక రైతులు చనిపోతున్నారు : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
రైతుల ప్రాణాలను తీసే పారాక్వాట్ వంటి మందులను అమెజాన్ లో కూడా అమ్మకానికి పెట్టడం బాధాకరమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు అమాయకులు కావడంతో ఎరువులపై అంత అవగాహన ఉండదని, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కంపెనీలు మోసం చేస్తున్నాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోఠిలోని ఐఎంఏ హాల్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మన పూర్వీకులు ఇలాంటి మందులు వాడలేదని ఇప్పుడు రసాయనాలతో కూడిన వ్యవసాయం అయిపోయిందన్నారు. మల్టీ నేషనల్ కంపెనీ వాళ్ళ కోసం ఇలాంటి మందులను తీసుకొస్తున్నారు. ఈ గడ్డి మందుతో మనుషులు ప్రాణాలు పోతున్నాయని కల్తీ ఎరువులు, మందులు వ్యవసాయ రంగం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుందన్నారు. పారాక్వాట్ను నిషేదించేలా కేంద్ర చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ లను కలిసి వినతిపత్రం అందజేస్తానని తెలిపారు. అనంతరం ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ప్రజలు ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గడ్డి మందు నిషేధించాలని, దీనిపై పార్లమెంట్ లో కూడా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. తనకు ఈ అంశంపై ఆరు నెలలు క్రితం తెలిసిందని ఇలాంటి ప్రమాదకరమైన మందులు అమెజాన్ వంటి ఆన్లైన్లో విక్రయించడం బాధాకరంగా ఉందన్నారు. ఈ మందుతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిని పూర్తిగా నిషేధించేలా తన వంతు కృషి చేస్తానని కోదండరెడ్డి పేర్కొన్నారు.






